Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సాయం : వైకాపా ఎంపీ రూ.4 కోట్లు కేటాయింపు

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (16:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లగా విస్తరిస్తోంది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా ఏపీ సర్కారు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ, తీసుకోవాల్సిన చర్యలు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 
 
అదేసమయంలో కరోనా బాధితుల కోసం పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, సినీ హీరో నితిన్ కూడా రూ.10 లక్షలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైకాపాకు చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఏకంగా రూ.4 కోట్ల సాయం ప్రకటించారు.
 
అయితే, ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత నిధుల నుంచి కాకుండా, ఎంపీ నిధుల నుంచి కేటాయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కరోనా కట్టడికి జగన్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. 
 
వలంటీర్ వ్యవస్థ ద్వారా వైరస్ కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సహచర ఎంపీలు కూడా తమ ఎంపీలాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కరోనా నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే రాష్ట్ర ఖజానాపై కొంత భారం తగ్గుతుందని ఆ లేఖలో బాలశౌరి అభిప్రాయపడ్డారు. 

అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ రెండు నెల‌ల వేత‌నాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఆ రెండు నెల‌ల వేత‌నంలో ఒక నెల వేత‌నాన్ని ప్ర‌ధాని సహాయ నిధికి, మరో నెల వేత‌నాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇవ్వనున్నట్టు వైసీపీ ఎంపిలు వెల్ల‌డించారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయ‌కుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments