Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో ఉపాధ్యాయల బదిలీల ప్రక్రియ

Webdunia
గురువారం, 18 మే 2023 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బదిలీలు పూర్తి అయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడతామన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పదోన్నతులు, బదిలీల గురించి భేటీలో చర్చించినట్లు చెప్పారు.

నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపట్టనున్నట్లు చెప్పారు. 675 ఎంఈఓ-2 పోస్టులకు సంబంధించి రేపు జీఓ జారీ చేయనున్నట్లు చెప్పారు. 350 మంది గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయులు, 9,269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామన్నారు.

1,746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియను రేపటినుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. కోర్టులకు వెళ్లి ప్రక్రియను అడ్డుకోవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments