Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక అరాచకాలు సాగవు...

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:52 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంద‌ని, ఇక అరాచకాలు సాగవ‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనంతా ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యం అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే, వైసీపీ  కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు.

 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు  నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచి మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని  అచ్చెన్నాయుడు అన్నారు. మహిళా హోం మంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే,  రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
 
అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్నవారికి ముందు రోజుల్లో మహిళల చేతిలో బడితె పూజ ఖాయం అని చెప్పారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక వారి అరాచకాలు సాగవు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది  టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ గుర్తుంచుకోవాల‌న్నారు. మళ్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

మైనర్ బాలికను అసిస్టెంట్ గా చేసుకున్న జానీ మాస్టర్ - నిర్మాణ సంస్థలోనూ కమిట్ మెంట్ చేయాలి?

వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని వుంది : జూనియర్ ఎన్టీఆర్

నా ఫేవరేట్ డైరెక్టర్ ఒప్పుకుంటే డైరెక్ట్ తమిళ సినిమా చేస్తా : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments