తేలు కుట్టడంతో రక్తపు వాంతులు.. విద్యార్థి మృతి

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:23 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఓ విషాదకర ఘటన జరిగింది. తేలు కుట్టడంతో రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. తరగతి గదిలో పడివున్న చాక్లెట్ రేపర్లను బయటపడేస్తుండగా విద్యార్థిని తేలుకుట్టింది. ఆ తేలు విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్, శ్రీదేవిల కుమారుడు అభిలాష్ (14) అనే బాలుడు వాకతిప్ప జడ్పీహెచ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. వలస కూలీ అయిన ప్రసాద్ వరంగల్‌లో పని చేస్తుండగా, శ్రీదేవి మాత్రం కువైట్‌లో పనిచేస్తుంది. అభిలాష్ మాత్రం తన తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం అతడు తన స్నేహితులతో కలిసి క్లాస్ రూంలో పడివున్న చాక్లెట్ రేపర్లను ఏరి, బయటపడేతుండగా ఆ రేపర్ల కింద దాగివున్న తేలు కుట్టింది. ఆ వెంటనే అభిలాష్‌ను ఉపాధ్యాయులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు పంపించారు. అయితే, అప్పటికే విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments