Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో వేసవి సెలవులు ప్రారంభం... ఏపీలో ఎప్పటి నుంచంటే..

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (13:32 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ఇచ్చేసింది. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా సెలవులు ఇవ్వలేదు. 
 
ఈ నెల 30వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ఏపీలో సెలవులు మొదలుకానున్నాయి. అంటే ఏపీలోని పాఠశాలలకు చివరి పనిదినం ఏప్రిల్ 29వ తేదీ శనివారం. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. మొత్తంగా చూసుకుంటే 43 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చారు. 
 
ఈ మేరకు అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకు మే ఒకటో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
మరోవైపు, తెలంగాణాలో ఇప్పటికే వేసవి సెలవులు మొదలయ్యాయి. ఈ నెల 25 నుంచి సెలవులు ప్రకటించారు. 
 
జూన్ 12వ తేదీన తిరిగి బడి తలుపులు తెరుచుకోనున్నాయి. ఇందులోభాగంగా, జూన్ ఒకటో తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. అంటే, బడిఈడు పిల్లలను గుర్తించి, వారికి పాఠశాల్లో అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ పాఠశాలలు మాత్రం జూన్ 12వ తేదీనే తెరుచుకుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments