Webdunia - Bharat's app for daily news and videos

Install App

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

సెల్వి
శనివారం, 29 మార్చి 2025 (18:23 IST)
జనసేన నేతలు, పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ తన ఎక్స్ ఖాతాలో పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. 
 
అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ వీడియో ద్వారా వర్మ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ను టార్గెట్ చేశారని చర్చ సాగుతోంది. 
 
అయితే.. వర్మ మాత్రం సైలెంట్‌గా నియోజకవర్గంలో తన కేడర్ కోల్పోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తే అధినేత అనే కార్యక్రమం ద్వారా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. 
 
మరోవైపు పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసి గెలిపించుకుంటే ఇప్పుడు వర్మను పట్టించుకోవడం లేదని ఆయన అభిమానులు, స్థానిక టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments