ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనపై పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన కేసులో రాయచోటి పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఆయనను శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
జనసేన పార్టీ నేత మణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానికి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచనున్నారు. ప్రస్తుతం పోసానిపై మొత్తం 11 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్రవిమర్శలు చేసినందుకు కూడా కేసు నమోదైంది.