Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మౌత్ టాక్ తో రన్నింగ్ లో వున్న సెటైరికల్ మూవీ గొర్రె పురాణం

sailesh kolanu, suhas, bobby

dv

, గురువారం, 26 సెప్టెంబరు 2024 (14:14 IST)
sailesh kolanu, suhas, bobby
ఇటీవలే విడుదలైన గొర్రె పురాణం చిత్రానికి పెద్దగా పబ్లిసిటీ లేదు. విడుదలకు ముందు ఇందులో నటించిన సుహాస్ సహకరించలేదని టాక్ ఇండస్ట్రీ నెలకొంది. తను ఇంతకుముందు రెండు సినిమాల హిట్ తో పేరుతెచ్చుకున్నాడు. అలాంటిది సరికొత్త కథాంశంతో గొర్రె నేపథ్యంతో దర్శకుడు బాబి తీసుకువచ్చిన కథను ఓకే చేయడం జరిగింది. ఆ చిత్రం షూటింగ్ లో కూడా మరో దర్శకుడు శైలేష్ కొలను కూడా హాజరయి ఆసక్తికరంగా వుందని కితాబిచ్చారు. అయితే సున్నితమైన అంశం చాలా కేర్ తీసుకుని చేయాలనే సూచన చేసినట్లు తెలిసింది.
 
అసలు ఈ గొర్రెపురాణంలో దర్శకుడు బాబీ చర్చించింది హిందూ, ముస్లిం మధ్య వుండే చిన్న పొరను బేస్ చేసుకోవడం సాహసమే అని చెప్పాలి. లోగడ పొట్టేల్ పున్నమ్మ, ఎద్దు నేపథ్యంలోనూ, ఆవు నేపథ్యంలోనూ తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కడా మతపరమైన అంశాలు తేలేదు. కానీ దర్శకుడు బాబీ మాత్రం ఈ సినిమాలో అటువంటి అంశాన్ని తెచ్చాడు. అయినా ఎక్కడా ఎవరినీ విమర్శించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. విడుదలయ్యాక పబ్లిసిటీ పెద్దగా లేకపోవడంతో మౌత్ టాక్ తో నడుస్తోంది. ఇందులో సుహాస్ పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఒకరకంగా గొర్రె పేరుతో టైటిల్ పెట్టిన సినిమాలో నటించడం నటుడిగా ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తుంది. అలాంటిదికి ప్రమోషన్ కు వచ్చే సినిమాకు మరింత హెల్ప్ అయ్యేదని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
తెలుగులో సెటైరికల్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు గొర్రె పురాణం సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశారు. హిందీలో రాజ్ హిరానీ వంటి దర్శకులు తరహాలో కథను బాబీ ఎంచుకున్నాడు. అయితే కథనాన్ని మరింత ఆకర్షనీయంగా రాసుకుంటే బాగుండేదనే టాక్ కూడా నెలకొంది.  దాంతో మొదటి రోజు పబ్లిక్ టాక్ అంతంత మాత్రమే ఉన్నా క్రమంగా మంచి టాక్ తో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.
 
సాంకేతికను  వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడిని అభినందించాల్సిందే. అందుకు ఈ సినిమాకు కనెక్ట్ అయ్యేవారు వుండడంతో మౌత్ టాక్ తో ముందుకు సాగుతోంది. పరిమిత బడ్జెట్ తో సెటైరికల్ సినిమా కాస్త లాగ్ వుండడంతో మొదట్లలో టాక్ పెద్దగా లేదు. ప్రస్తుతం మంచి రన్నింగ్ లో వున్న ఈ సినిమా దర్శక నిర్మాతలకు మంచి ఊపిరినిచ్చిందనే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోల్పోయిన కీర్తిని జానీ తిరిగి పొందడం కష్టం.. అంత సులభం కాదు..