ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పు పూర్తయింది. మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం స్వయంగా గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.
రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్ బెర్త్‌లు కేటాయించారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు. మంత్రులుగా అవకాశం దక్కినవారికి ఫోన్లు చేస్తున్నారు.