Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడిని నిలదీయలేని చేతకాని, దద్దమ్మ పార్టీ వైస్సార్సీపి: మంత్రి సోమిరెడ్డి

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని నరేంద్ర మోడిని నిలదీయలేని చేతకాని, దద్దమ్మ పార్టీ వైఎస్ఆర్ సిపి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి కేసులు, తన కుటుంబం తప్ప ప్రజా సంక్షేమం పట్ట

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (20:57 IST)
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని నరేంద్ర మోడిని నిలదీయలేని చేతకాని, దద్దమ్మ పార్టీ వైఎస్ఆర్ సిపి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి కేసులు, తన కుటుంబం తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయాలను నవ్వుల పాల్జేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేర్పాటువాదంతో బీజేపీ మరోసారి నవ్యాంధ్రను విడగొట్టడానికి కుట్రపన్నుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. 
 
ప్రతిపక్ష పార్టీ తీరుతో రాజకీయాలు నవ్వులపాలవుతున్నాయన్నారు. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికి తపన పడుతుంటారన్నారు. తాను, తన కేసులు, ఆస్తులు అంటూ జగన్ రాజకీయం సాగుతోందన్నారు. ఢిల్లీ పైరవీలు, లాబీయింగ్ చేసే బాధ్యత ఎంపి విజయసాయి రెడ్డికి జగన్ అప్పగించారని మంత్రి దుయ్యబట్టారు. ఒకవైపు ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేస్తుంటే మరోవైపు ప్రధాని నరేంద్రమోడిపై తమకు నమ్మకం ఉందని, ఆయన తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని చెబుతూ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి చెబుతోందన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ భగవద్గీతతో పోలుస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి మీడియా ఆకాశనకెత్తెస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ఖరాకండీగా చెబుతుంటే, ప్రధానిమంత్రి నరేంద్రమోడిని నిలదీయలేని చేతగాని, దద్దమ్మ పార్టీ వైఎస్ఆర్ సిపి... సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమేమిటని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ-టీపీడీ బంధం తెగిపోతే, కమలం పార్టీతో తాము జతకడతామని వైఎస్ఆర్ సిపి నాయకుడు బొత్స సత్యనారాయణ నిస్సిగ్గుగా ప్రకటించారన్నారు. 
 
శాసనసభలో శాసనాలు చేయకుండా, ప్రభుత్వం తప్పొప్పులు సభ దృష్టికి తీసుకుండా, జగన్ వీధులు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఎక్కువ సీట్లు సాధిస్తేనే సభకు ఏ పార్టీ అయినా వస్తుందా... అని ప్రశ్నించారు. బీహార్లో జేడియూ, ఆర్జేడీ బంధం తెగిపోయి, తక్కువ సీట్లు వచ్చిన బీజేపీతో నితీష్ కుమార్ జతకట్టలేదా... ప్రతిపక్షంలో ఉన్న కమలం పార్టీ గద్దె ఎక్కి కూర్చోలేదా? అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. తమ పార్టీకి నైతిక విలువలే ముఖ్యమన్నారు. తమ పార్టీ అధినేతది 40 ఏళ్ల రాజకీయ జీవితమని, టీడీపీ ఏర్పడి 36 ఏళ్లు అయ్యిందని మంత్రి తెలిపారు. టీడీపీకి ప్రత్యేక నైతిక వ్యవస్థ కలిగి ఉందన్నారు.
 
ఒక ఓటుకు రెండు రాష్ట్రాలంటూ బీజేపీ మరోసారి ఏపీని విడగొట్టడానికి కుట్ర పన్నుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం జరిగిందంటూ బీజేపీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. రాయలసీమ వాదాన్ని వినిపిస్తున్న బీజేపీని వైఎస్ఆర్ సిపి నేతలు నిలదీయకుండా తప్పుకుతిరుతున్నారన్నారు. ఇలా రెండు పార్టీ నేతలు ఒకరి తప్పులను మరొకరు పట్టించుకోకుండా రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. తెలంగాణాలో మూడేళ్ల కిందటే టీడీపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అక్కడి బీజేపీ నేతలు ప్రకటించారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments