Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019లో జగనే సీఎం.. రోజా.. అవిశ్వాసానికి మద్దతివ్వాలా? బాబు ప్రశ్న

ప్రత్యేక హోదాను తాను ఇరుకున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు వదిలేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని ఆ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా అన్నార

Advertiesment
2019లో జగనే సీఎం.. రోజా.. అవిశ్వాసానికి మద్దతివ్వాలా? బాబు ప్రశ్న
, సోమవారం, 12 మార్చి 2018 (15:08 IST)
ప్రత్యేక హోదాను తాను ఇరుకున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు వదిలేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని ఆ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా అన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్‌ గెలుస్తారని.. ఆయన సీఎం కావడం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు. 2019లో జగన్ సీఎం కావడం ఖాయమని.. వైకాపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రోజా మీడియాతో అన్నారు. 
 
నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి హోదా కావాలని జగన్ ఎంతో డిమాండ్ చేస్తున్నారని, నిరాహార దీక్షలు కూడా చేశారని రోజా గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా హోదా కావాలని అడుగుతున్నారంటే, అది జగన్ సాధించిన విజయమేనని అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను గత మూడున్నరేళ్లుగా మోసపు మాటలతో మభ్యపెట్టిన చంద్రబాబు సర్కారుకు తమ ఓటుతో ప్రజలు బుద్ధి చెప్తారని రోజా జోస్యం చెప్పారు.
 
అంతకుముందు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రత్యేక హోదా విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్నారు. విశ్వాసం వుందంటూనే.. అవిశ్వాసం పెడతామనడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఇంకా వైకాపా పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతివ్వాలనడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుపారీ లేదా హత్య.. రాజీవ్ గాంధీ హత్యోదంతంపై బీజేపీ స్వామి సంచలన వ్యాఖ్యలు