Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి ఆర్కే.రోజా మొబైల్ ఫోన్ చోరీ

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:04 IST)
ఇటీవల ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్.కె.రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె మొబైల్ ఫోను చోరీకి గురైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారి సొంత చిత్తూరు, సొంత నియోజకవర్గం నగరికి వచ్చారు. ఆ తర్వాత బుధవారం మంత్రి హోదాలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
గురువారం తిరుపతిలో జరిగిన  పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిమ్మట మధ్యాహ్నం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించేందుకు, అభినందించేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు వైకాపా నేతలు పోటీపడ్డారు. దీంతో అతిథి గృహం వద్ద భారీ సంజన సందోహం ఏర్పడింది. ఇదే అదునుగా ఓ వ్యక్తి తన చేతివాటం ప్రదర్శించి రోజా మొబైల్‌ను చోరీ చేశారు. 
 
తన మొబైల్ ఫోన్ చోరీకి గురైన విషయాన్ని గ్రహించిన రోజా బందోబస్తులో ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజీల్లో మంత్రి రోజా మొబైల్ ఫోనును చోరీ చేసిన వ్యక్తి కారులో ఎక్కేసి అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. 
 
ఇపుడు కారు నంబరు ఆధారంగా ఆ దొంగ కోసం పోలీసులు ఆరా తీయగా, ఆ వ్యక్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణంలోకి వెళ్లినట్టుగా గుర్తించి, అక్కడకు పరుగులు తీసి ఎట్టకేలకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఫోనును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో అతను కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. చోరీకి గురైన ఫోనును పోలీసులు మంత్రి రోజాకు అందజేయడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments