విద్యార్థులు సరిగా చదవలేదు.. అందుకే ఫెయిలయ్యారు : మంత్రి రోజా

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:38 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీ  చరిత్రలో ఎన్నడూ లేనంతగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులు చెందిన విద్యార్థుల కంటే ఫెయిల్ అయిన విద్యార్థుల శాతమే అధికంగా ఉంది. బాగా చదివే విద్యార్థులు సైతం ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీటిని ఏపీ మంత్రులు తిప్పకొడుతున్నారు. విద్యార్థులు సరిగా చదవలేదని అందుకే  ఫెయిల్ అయ్యారంటూ సెలవిచ్చారు. 
 
తాజాగా ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే.రోజా కూడా ఇదే పాటపాడారు. "తెలుగుదేశం అధికారంలో ఉన్న టీచర్లే ఇపుడూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సరిగా చదువుకోకపోవడం వల్లనే కొంతమంది విద్యార్థులు పదో తరగి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు" అని మంత్రి వివరణ ఇచ్చారు. 
 
పైగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు సిప్లమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు పాస్ అయిన వారికి రెగ్యులర్‌గా ఇచ్చే సర్టిఫికేట్లే ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా, పదో తరగతి పరీక్షల్లో మన రాష్ట్రం కంటే చాలా తక్కువ శాతం పాస్ అయిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయని ఆమె గుర్తుచేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments