Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" సినిమాకు టిక్కెట్లు పెంచుకోవచ్చు : పేర్ని నాని

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (13:41 IST)
రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, భారీ బడ్జెట్ సినిమా విడుదలైన 10 రోజుల పాటు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. సాధారణ ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు, ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ సినిమాస్‌పై నిర్మించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments