రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ దొంగ పాదయాత్రలు..

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (19:03 IST)
టీడీపీ నేతలు రైతుల్ని మోసం చేసి వారి పేరుతోనే రియల్ ఎస్టేట్ యాత్ర చేస్తున్నారని ఏపీ రవాణ, సమాచార శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దొంగ పాదయాత్రలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్రకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 
 
ఈ సందర్భంగా ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాదయాత్రలో వాస్తవమైన రైతులెవరూ లేరని.. ఉన్నవారంతా టీడీపీ నేతలేనని ఆరోపించారు.
 
‘కోర్టు, న్యాయమూర్తుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే. ఈ యాత్రకి చందాల పేరుతో చంద్రబాబు అండ్‌కో తమ నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  
 
పేదవారికి అమరావతిలో ఇళ్లు ఇస్తామని చెబితే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందనేవాళ్లు రైతులు ఎలా అవుతారని మంత్రి సూటిగా ప్రశ్నించారు. నిజమైన ఏ రైతన్న ఈ రకంగా ఆలోచించడని అన్నారు. టీడీపీ చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments