Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (17:46 IST)
ఏపీ మంత్రి, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడుకి రక్తస్రావం కాకుండా ప్రథమిక చికిత్స చేశారు. ఈ సంఘటన విజయవాడ ప్రకాశం బ్యారేజీపై కనిపించింది. ఈ వంతెనపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యుకుడు తలకు దెబ్బతగిలింది. రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే తన వాహనం ఆపి సిబ్బంది సాయంతో ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేశారు. తల నుంచి రక్తస్రావం కాకుండా ఆపారు. 
 
108కు ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి, క్షతగాత్రుడుని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడు 108 అంబులెన్స్‌లో ఎక్కించుకుని వెళ్లేంత వరకు అక్కడే ఉన్నారు. పైగా, అతనికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి నాదెండ్ల సూచించారు. ఆ యువకుడుని విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రిలో చేర్చుతున్నట్టు 108 సిబ్బంది సమాచారం ఇచ్చారు. 
 
కాగా, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడిపే మంత్రి మనోహర్.. రోడ్డుపై జరిగిన ప్రమాదా్ని చూసి కారు ఆపడం, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంత్రిని ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments