Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేశ్ సాహచర్యంతోనే తనకూ మాటలు అలాగే వస్తున్నాయ్ : అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామాణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్న నారా లోకేశ్... పలు సందర్భాల్లో.. పలు వేదికలపై మాట్లాడుతూ తప్పులు మాట్లాడి అభాసుపాలయ్యారు. ముఖ్యంగా జయంతికి బదులు వర్థంతి, వర్థంతి శుభాకాంక్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (12:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామాణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్న నారా లోకేశ్... పలు సందర్భాల్లో.. పలు వేదికలపై మాట్లాడుతూ తప్పులు మాట్లాడి అభాసుపాలయ్యారు. ముఖ్యంగా జయంతికి బదులు వర్థంతి, వర్థంతి శుభాకాంక్షలు అంటూ నోరుజారి ఆ తర్వాత నాలిక్కరుచుకున్నారు. ఇపుడు ఇదేవిధంగా సీనియర్ మంత్రిగా ఉన్న కె అచ్చెన్నాయుడి నోటి వెంట కూడా తప్పులు దొర్లుతున్నాయి. ఇలా రావడానికి మంత్రి లోకేశ్‌ సాహచర్యమేనంటూ సమాధానమిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... గౌతు లచ్చన్న వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. వెంటనే పక్కనున్న వారు తప్పును సవరించగా, వెంటనే అచ్చెన్న కల్పించుకుని లోకేశ్ సాహచర్యంతోనే తనకూ అలాగే వచ్చిందని చెప్పి అక్కడున్న వారిని నవ్వించారు. మొత్తంమీద తాను చేసిన తప్పును లోకేశ్‌పై నెట్టేశారు. కాగా, గతంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని నారా లోకేశ్ వర్థంతిగా పేర్కొని విమర్శలు పాలైన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి దిల్ రూబా టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments