వచ్చే ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఓటు వేయకపోతే వారు తప్పుచేసినట్టేనని ఏపీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తుందని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా వైకాపాకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకపోతే వారు తప్పు చేసినట్టేనని అన్నారు. ఇది జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అవుతుందని చెప్పారు.
పనిలోపనిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యువతను పవన్ వంటి వారు రెచ్చగొట్టి పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు వద్ద రూ.44 కోట్లతో అమరావతి తుళఅలూరు రహదారి, పెదమద్దూరు వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు.
అలాగే, 10 టీఎంసీల నీట నిల్వ సామర్థ్యంలో కృష్ణానదిపై త్వరలోనే వంతెనను నిర్మిస్తామని, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, నంబూరు శంకర్ రావులు, పార్టీ నేతలు హాజరయ్యారు.