Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం.. మా జగన్ జైల్లో ఉండలేదా? చంద్రబాబు విషయంలో సర్కారు తప్పులేదు : మంత్రి ధర్మాన

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (16:59 IST)
మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంటి వారు జైల్లో ఉండిరాలేదా అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పైగా, మాలాంటి వారంతా జైలుకు వెళ్లివచ్చామన్నారు. అందువల్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ప్రభుత్వం తప్పు లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి ధర్మాన స్పందించారు. ప్రభుత్వం ప్రజల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేస్తుంటే.. చంద్రబాబు హయాంలో జర్మనీ కంపెనీ పేరిట ఆయన కొడుకు ఖాతాలో డబ్బు జమ చేయించారు అని వ్యాఖ్యానిం చారు. 
 
'పీవీ నరసింహారావు, జయలలిత, ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై కేసులు నమోదయ్యాయి. వారు కూడా జైలుకు వెళ్లారు. అంతెందుకు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి జైల్లో ఉండి రాలేదా? మాలాంటివారు కోర్టులో కేసులకు వెళ్లలేదా..? చంద్రబాబును పట్టుకున్నది మేం కాదు. మా ప్రభుత్వ తప్పులేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. ఇంకా ఎన్నో తేలాల్సి ఉందో' అన్నారు.
 
అదేసమయంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రమాదకరమని ధర్మాన వ్యాఖ్యానించారు. 'సామాజిక స్పృహతో సీఎం జగన్ రాష్ట్రంలోని పాఠశాలలను ఎంతగానో బాగుచేశారు. కానీ, ఉపాధ్యాయులు మెచ్చుకోరు. శభాష్ అనరు. ఎందుకంటే వారికి స్కూల్‌కు వెళ్లినప్పుడు 'థంబ్ వేయమన్నారని అక్కసు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ల దృష్టిలో పిచ్చోడు. మంచిని గమనించక పోతే ఎలా? ఇంత అన్యాయంగా టీచర్లు ఉంటే ఎలా? సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? మీ పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేస్తారు. అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments