Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమరిపోతు వ్యవసాయం ఏదైనావుందంటే అది వరిసాగే : మంత్రి రంగనాథ రాజు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (09:06 IST)
ప్రస్తుతం సోమరిపోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వ్యవసాయం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. తాను వేరే జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు ఇదే విషయం చెబుతుంటానని సెలవిచ్చారు. 
 
శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడారు. 'సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను... అంటే వచ్చి దున్నుతాడు బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే... ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
మంత్రి మాటలతో కిసాన్‌మేళాకు హాజరైన రైతులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ఇక్కడ విచిత్రమేమింటే శ్రీరంగనాథ రాజు గతంలో రైస్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేయడం గమనార్హం. ఇదేసమయంలో వరిసాగులో ఉన్న కష్టాలను కూడా మంత్రి వివరించారు. 90 శాతానికి మందిపైగా కౌలు రైతులే ఉన్నారని, ఇబ్బంది వస్తే వారే నష్టపోతున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments