Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:07 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు.
 
 స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లా తిరుచనూరులోని శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. 
 
రోగుల పట్ల సరైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. రోగుల నుంచి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వంట గదిని, మందుల పంపిణీ కేంద్రాన్ని, కరోనా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ఉద్యోగులతో మాట్లాడి వారి పని తీరును ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments