Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే: మంత్రి బొత్స

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:51 IST)
దేశంలో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని, రోజుకు రెండు వేల మందికి ఈ టెస్టులు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

వచ్చే నెల 3 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.

అదే సమయంలో, ‘కరోనా’ నియంత్రణకు రాష్ట్రంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘కరోనా’ హాట్ స్పాట్స్ గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలకు వారి ఇళ్లకే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామని, అవసరమైన మందులు కూడా అందిస్తామని తెలిపారు.

దేశంలో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని, రోజుకు రెండు వేల మందికి ఈ టెస్టులు చేస్తున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments