Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముస్లింలకు నారాయణ స్వామి క్షమాపణ

Advertiesment
Narayana Swamy
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:59 IST)
ముస్లింలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖామంత్రి కె.నారాయణ స్వామి క్షమాపణ చెప్పారు. అన్ని విధాలుగా ఒత్తిళ్లు పెరగడంతో ఆయన ఎట్టకేలకు చెంపలేసుకున్నారు.

ముస్లిముల మనోభావాలను దెబ్బతీయడం తన అభిమతం కాదని, ఇబ్బందికి గురిచేస్తే క్షమించాలని తెలిపారు. ఆ వివరాలు నారాయణ స్వామి మాటల్లోనే.....
 
1.ముస్లిం సోదరులకు, ముస్లిం గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతిలో మాట్లాడే సమయంలో.. కరోనా పాజిటివ్ కేసులు రావడం గురించి మాట్లాడాను. దానిపైన ముస్లింలను  విమర్శించాలని ఆత్మసాక్షిగా నాకు లేదు.
 
2.నేను కూడా దళితుడ్ని. నాకు ఎస్సీలు, ఎస్టిలు, బిసిలు మైనారిటీలు అందరూ కూడా ఒకే కులస్తులుగా భావించేవాడ్ని. మనందరం సమాజంలో చాలా వెనకబడినవారం.
 
3.ఈరోజు వెనకబడిన వర్గాలకోసం రాజకీయ సమానత్వమే కాకుండా రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్దికంగా ఆ వర్గాలను పైకితెస్తూ కులవ్యవస్దను, మతవ్యవస్దను దూరం పెట్టిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.
 
4.ఒక కులంమీద గాని, మతం మీద గాని దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. వారి మత గురువులు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే దానిని పాటించే అలవాటు అన్ని మతస్తులకు ఉంది. అదే విధంగా ఢిల్లీలో జరిగిన  సంఘటన ఇతర దేశాలనుంచి వచ్చిన వారి వల్ల పాజిటివ్ కేసులు వచ్చాయి. 
 
5.అదే విధంగా ఏ మతస్తులు సభలు పెట్టుకున్నాగాని, క్రిష్టియన్ సభలు పెట్టుకున్నాగాని వేరే మతస్తులు గురువులు వచ్చినప్పుడు వాటిక్కూడా బయట దేశస్దులు వస్తే కరోనా పాజిటివ్ రావడం సహజం. అదే విధంగా హిందుమతానికి సంబంధించి ధార్మికమైన మతగురువులు సందేశాలు ఇచ్చేటప్పుడు విదేేశాలనుంచి వస్తే కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.
 
6.అందుకని నేను నిన్న పూర్తిగా మైనారిటీ అనే వారు ఏదైనా ప్రసాదం తీసుకుంటే అది కిందపడకుండా స్వీకరించే సాంప్రదాయం దేవుని పైన భక్తితో వారిలో ఉంది. అదేవిధంగా ఇతర మతస్తులు తీర్ధం తీసుకున్నప్పుడు కిందపడకుండా తీసుకునే అలవాటు ఉంది. ముఖ్యంగా నాకు ముస్లింలపై ఎలాంటి ద్వేషం లేదు- ఎలాంటి పగలేదు.
 
7.నేను మొదటి నుంచి కూడా ముస్లిం సోదరులతోనే ఉండేవాడ్ని. నా రాజకీయ చరిత్రలో కూడా 1981లో హబీబ్ అనే అతనిని సర్పంచ్ గా పోటీ పెట్టించాను. అప్పుడు ఆయన ఓడిపోయినా ఎంకరేజ్ చేశాను. వారి ఇళ్ల స్దలాల విషయంలో గాని వారి సామాజిక అంశాల విషయంలోగాని వారిలో ఒక వ్యక్తిగా కలసిమెలసి వెళ్లే అలవాటు నాకు ఉంది.
 
8. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు ఎటువంటి పదవులు ఇచ్చారు. ఈ సమాజంలో వారిని ఏవిధంగా పైకి తీసుకువచ్చారో కూడా మీ అందరికి తెలుసు.
 
9.నిన్న నా మాటలు చాలామందికి  బాధాకలిగినట్లు తెలిసింది. ముస్లిం మతస్ధులు కూడా డిప్యూటి సిఎం గా ఉన్న వ్యక్తి మతపరంగా మాట్లాడటం చాలా దారుణం అని బాధపడ్డారని తెలిసింది.
 
10. నేను వారిని బాధించే విధంగా ఏదైనా మాట్లాడి ఉంటే  నా ఆత్మసాక్షిగా నన్ను మన్నించాలని ముస్లిం మతగురువులను, ముస్లిం మతస్దులను కోరుతున్నాను. ఎందుకంటే మనమంతా మానవులం. ఇండియాలో పుట్టినవాళ్లం. మనం అందరం ఒకే వర్గానికి చెందినవారం. మతద్వేషంగాని, కులద్వేషంగాని నాలో ఎప్పుడూ లేదు.
 
11.నేను అప్పీలు చేస్తున్నాను. ఎటువంటి పరిస్దితులలో కూడా ముస్లింల మనస్సు బాధించే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినేటట్లు ప్రవర్తించను. జరిగిన దానికి బాధపడుతున్నాను. ముస్లిం సోదరులు, వారి మతగురువులు నన్ను క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
 
12.మతం, కులం అని లేకుండా మనమందరం సోదరభావంతో కలసిమెలసి ఉండాలని ప్రార్దిస్తున్నాను.
 
13.ఈ విషయంలో ముఖ్యమంత్రి  నాతో ఈరోజు కూడా ఈ అంశంపై మాట్లాడారు. వారి ఆలోచన ప్రకారం ఏ విధమైన మతద్వేషంగాని, కులద్వేషంగాని ఉండకూడదు.
 
14.అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులందరికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఏ కులస్తులకు కూడా దూరంగా లేరు. ముందుగా వారి తండ్రి వైఎస్సార్ గారు కూడా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది.
 
15.నేను మతద్వేషం రెచ్చగొట్టేంత నీచమైన వ్యక్తిని కాను. నన్ను మనస్పూర్తిగా క్షమించాలని కోరుతున్నా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషుల్లారా! పారాహుషార్.. కరోనా మరణాలు పురుషుల్లోనే అధికం