Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:49 IST)
వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్‌లో మూడు కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి రికార్డు సృష్టించింది. ఆరుకోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్‌ వేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది.

కాగా, కేంద్రం నుంచి మరిన్ని డోసులు వస్తే రాబోయే రెండు నెలల్లోనే మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల సహకారంతో ఏపీలో శరవేగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

నేటి స్పెషల్‌ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.50 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇ‍ప్పటివరకు మొత్తంగా 3,00,87,377 మందికి వ్యాక్సిన్‌ వేశారని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు తొలిడోసును 2,16,64,834 మంది వేసుకోగా  రెండు డోసులు వేసుకున్నవారు 84,22,543 మందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments