Publish Date: Tue, 31 Aug 2021 (20:52 IST)
Updated Date: Tue, 31 Aug 2021 (20:54 IST)
ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్న ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం 4.50 గంటలకు ఇడుపుల పాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్‌ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేయనున్నారు
ఇక సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ నాయకుల తో మాట్లాడి.. తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు.
ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.