Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై కోర్టు తీర్పును ధిక్కరించిన సర్కారు.. నేడు హైకోర్టులో విచారణ

Webdunia
గురువారం, 5 మే 2022 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాజధానే అమరావతి అంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ పాలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 
 
అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరుగనుంది. 
 
రైతుల తరపున ఉన్నం మురళీధర్ అనే న్యాయవాది హాజరుకానున్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. నిధులు లేవనే సాకుతో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రధానంగా ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తుంటారు : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments