Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు : ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:23 IST)
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. 
 
సంగం డెయిరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగియంటూ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై గత నెల 23న ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
 
నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని.. నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. 
 
విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉండగానే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఆదేశాలు జైలుకు అందిన తర్వాత ధూళిపాళ్ల విడుదల కానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments