Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కరణ కేసులో డీఈవోకు కోర్టు తలంటు - సామాజిక సేవ చేయాలంటూ...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:07 IST)
కోర్టు ధిక్కరణ కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిని హైకోర్టు చీవాట్లు పెట్టింది. పలుమార్లు కోర్టు కోర్టు చేసిన హెచ్చరికలను డీఈవో కె.శ్యామ్యూల్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలంటూ ఆదేశించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయంపై గత 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తక్షణం ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. 
 
అయితే, కోర్టు ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదైంది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు... న్యాయస్థానం అమలులో ఒక యేడాది పాటు జాప్యం కావడానికి డీఈవోనే ప్రధాన కారణమని తేల్చింది. 
 
దీంతో కోర్టుకు ఆయన సారీ చెప్పారు. అయితే, క్షమాపణలు అంగీకరించాలంటే వారం రోజుల పాటు జిల్లాలోని ఏదేని వృద్ధాశ్రమంలోకానీ, అనాథాశ్రమంలోగానీ సామాజికసేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు డీఈవో అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments