Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటం గ్రామస్థులపై హైకోర్టు సీరియస్ - రూ.లక్ష చొప్పున అపరాధం

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (17:28 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గ్రామంలో రోడ్డు విస్తరణల పేరుతో పలు గృహాలను కూల్చివేశారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఊహించని విధంగా షాక్ తగిలింది. 
 
ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చినా.. నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారంటూ మండిపడింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. 
 
ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, గురువారం ఇరు వర్గాల వాదనలు ఆలకించింది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్‌దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆక్రమణలను కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపాపారు. 
 
ఈ సందర్భంగా నోటీసులు ఇచ్చింది నిజమేనని హైకోర్టు గుర్తించడంతో ఇప్పటం గ్రామస్థులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసకున్నారంటూ ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్‌దారులకు హైకోర్టు రూ.లక్ష చొప్పున అపరాధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments