Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు - యధావిధిగా పాదయాత్రకు ఓకే

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (16:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే యాత్ర సాగాలని తాజాగా తీర్పునిచ్చింది. అదేసమయంలో పాదయాత్రపై రైతులు, ప్రభుత్వం తరపున దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది. రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశించింది. రైతులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం తమను ఆశ్రయించాలని పోలీసులకు సూచించింది. 
 
నవ్యాంధ్రకు అమరావతినే రాజధానిగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చిన రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రను చేపట్టారు. అయితే, ఈ పాదయాత్ర డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయింది. గుర్తింపు కార్డులు చూపాలంటూ రైతులను పోలీసులు నిలువరించడంతో ఈ యాత్ర ఆగిపోయింది. 
 
ఈ క్రమంలో యాత్రను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రబుత్వం, యాత్రలో పాలుపంచుకునేవారికి మరిన్ని వెసులుబాట్లు కల్పించాలంటూ అమరావతి రైతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును కూడా తక్షణం వెలువరించింది. 
 
అమరావతి రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా, యాత్రలో పాలుపుంచుకునేవారికి మరిన్ని వెసులుబాటు కల్పించాలన్న రైతుల పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. పాదయాత్రకు సంబంధించి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే యాత్ర కొనసాగాలని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా గుర్తింపు కార్డులు ఉన్న రైతులు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments