Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. జీవో 72 కొట్టివేసిన హైకోర్టు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (13:47 IST)
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను హైకోర్టు కొట్టేసింది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత గజపతి రాజు నియామకం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. 
 
మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. గతంలో మాన్సాస్ ట్రస్టీ, సింహాచల దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఆ స్థానంలో  సంచయితను నియమించింది. దానికి సబంధించి 72 జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.  దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు న్యాయ పోరాటం చేశారు.
 
అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. తాజా హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్  ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి అశోక్ గజపతి రాజు  చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. 
 
తాజా తీర్పుపై సంచయిత గజపతి రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆమె తన వాదన నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.. అయితే తాజా తీర్పుపై ఆము ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments