Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించిందే జరిగింది...

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (11:48 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో అందరూ ఊహించిందే జరిగింది. ఈ అంశంలో సీఐడీని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్‌లో చంద్రబాబు ఉన్నారు. ఆయన బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిగింది.
 
ఆ సమయంలో చంద్రబాబు తరపున హాజరైన న్యాయవాదులు ట్రయల్ కోర్టు నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను హైకోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఇప్పటికే రెండు రోజుల సీఐడీ కస్టడీలో బాబు ఉన్నారని తెలిపారు. పైగా, స్కిల్ కేసులో నిందితులందరికీ ముందస్తు బెయిల్, బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తు కూడా పూర్తయిందన, చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్‌ కూడా 30 రోజులు దాటిపోయిందని, అందువల్ల చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
 
ఆ తర్వాత సీఐడీ తరపు న్యాయవాదులు స్పందిస్తూ, ఈ అంశంపై తాము ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని, కౌంటర్ దాఖలు చేస్తామని అందువల్ల తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments