Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకం..

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ప్రత్యేక కిట్‌లను అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం యేటా రూ.953.71 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 
 
ఈ పథకానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.778.68 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు కిట్‌లు అందజేయనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
 
ఈ కిట్‌లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫాంలు ఉంటాయి. అలాగే, ఒక్కో కిట్‌కు కోసం ప్రభుత్వం రూ.1,858 ఖర్చు చేయనుంది. యూనిఫాం తయారీకి సంబంధించి 8వ తరగతి వరకు రూ.120, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల యూనిఫాంలకు రూ.240 చొప్పున ప్రభుత్వం కుట్టుకూలీ చెల్లించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments