Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనక్కి తగ్గి సర్దుకుపోయిన ఏపీ ఉద్యోగులు ... సమ్మె విరమణ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మెట్టుదిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో సర్దుకునిపోయారు. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మెను విరమించుకున్నారు. ఈ విషయాన్ని శనివారం పీఆర్సీ సాధన సమితి నేతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం గుర్రుగా ఉన్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ పీఆర్సీ సాధన సమితి ఉద్యమ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలిపేలా శనివారం నిర్వహించిన మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. 
 
ఈ సందర్భంగా పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాలపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అవగాహన కలిగింది. 
 
ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రేమ ఏంటో నిరూపితమైంది. ఐదు డీఏలను ఒకేసారి ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ జీవోల జారీ తర్వాత అన్ని అంశాలు మరుగునపడ్డాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments