Webdunia - Bharat's app for daily news and videos

Install App

చడీచప్పుడు లేకుండా ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు నవ్వులపాలైంది. ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ డబ్బులను చడీచప్పుడు లేకుండా విత్‌డ్రా చేసింది. ఉద్యోగుల ఖాతాల నుంచి వారికి తెలియకుండా ఏకంగానే రూ.800 కోట్లను మాయం చేసింది. ఈ బాధితుల్లో 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రూ.800 కోట్ల మేరకు ప్రభుత్వం విత్‌డ్రా చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 
 
ఇదే అంశంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయి. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయితే కేసు నమోదుచేస్తామని హెచ్చరిస్తే తిరిగి డబ్బులు జమ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను డౌన్‌లౌడ్ చేసుకుని చూస్తే డబ్బులు విత్ డ్రా అయినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. 
 
తన ఖాతా నుంచే ఏకంగా రూ.80 వేల వరకు డ్రా అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను ప్రభుత్వం విత్ డ్రా చేసిందని ఆయన వాపోయారు. గతంలో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం తీసేకుంది. ఇపుడు రూ.800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ప్రభుత్వం డ్రా చేసింది అని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments