ఏపీలో మావోలకు షాక్ తప్పలేదు. పోలీసుల ఎదుట 60మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందినవారు.
వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలున్నారు. లొంగిపోయిన వారిలో మాజీ ఎంఎల్‌ఎలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
మావోయిస్టులు లొంగిపోవడంతో పాటు మరోవైపు మావోయిస్టుల డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డిఐజి హరికృష్ణ, ఎస్‌పి సతీశ్ మీడియాకు తెలిపారు. ఇందులో రూ.39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు వారు వివరించారు.
ముఖ్యంగా అనేక హింసాత్మక నేరాలలో చురుకుగా వ్యహరించిన మావోయిస్ట్ వంతల రామకృష్ణ లొంగిపోయాడని, అతనిపై 124 కేసులన్నాయని సతీష్ తెలిపారు.