Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన ఏపీ సర్కారు.. షోకాజ్ నోటీసు జారీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు షాకిచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసును పంపించింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించ లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెగాసెస్ సాఫ్ట్‌వేర్ అంశంతో పాటు ఆయన్ను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21వ తేదీన వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్మీట్‌పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడిన అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీచేశారు. 
 
ఇందులో ప్రభుత్వ అనుమతి లేకుండా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం, ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తగిన  చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments