ఆర్థిక కష్టాలు ఉన్నా కాపు నేస్తం అమలు చేస్తున్నాం : సీఎం జగన్

Webdunia
గురువారం, 22 జులై 2021 (13:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది  వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని గురువారం అమలు చేసింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును నేరుగా జమ చేశారు. 
 
ఈ పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది పేద మహిళలకు రూ. 490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. అయితే బ్యాంకులు పాత అప్పుల కింద ఈ డబ్బును జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నగదును జమ చేశారు.
 
ఈ డబ్బు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ, నిరుపేదలైన కాపుల కోసం వైయస్సార్ కాపు నేస్తాన్ని అందిస్తున్నామన్నారు. అర్హులైన కాపు మహిళలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున... ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. 
 
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయాన్ని అందిస్తామని, అర్హత లేని ఏ ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపజేయబోమన్నారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ... వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఏం చేసిందో అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని... ప్రతి ఏటా రూ.1,500 కోట్లు ఇస్తామని చెప్పి ఏడాదికి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, తాము అలా చేయబోమని సీఎం జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments