స్కూల్ ఫీజు : ప్రైవేట్ స్కూల్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్స్... తేడా వస్తే..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (18:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ తర్వాత కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. అంటే జూన్ రెండో వారం నుంచి పాఠశాలలు ప్రారంభంకావాల్సివుంది. అపుడు విద్యార్థుల నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దండకాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన ఏపీ సర్కారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
లాక్‌డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఏ విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదంటూ ఈ మేరకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదీకూడా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి గత యేడాది అంటే 2019-20 విద్యా సంవత్సరంలో వసూలు చేసిన ఫీజునే వసూలు చేయాలని కోరింది.
 
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇపుడు ఈ కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments