Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ : ఏపీ సీఎం జగన్

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై రాష్ట్ర కేబినెట్ కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో ఇచ్చింది. 
 
ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది.
 
కాగా, రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం నవరత్నాల పేరుతో ప్రభుత్వం వివిధ రకాలైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పథకాలతో వేలాది మంది లబ్దిపొందుతున్నారు. ఇపుడ్ అగ్రవర్ణ పేదల కోసం ఒక సంక్షేమ శాఖను ప్రవేశపెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments