Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎస్మా ప్రయోగం... ఆర్నెల్లపాటు 'ప్రైవేటు' సర్కారు ఆస్పత్రులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులన్నింటికి మూలం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌గా తేలింది. దీంతో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని ఏపీ అధికారులు, పోలీసులు జల్లెడపడుతున్నారు. అదేసమయంలో కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం చేసేందుకు వీలుగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ మేరకు ఇటీవల జీవో జారీచేసింది. శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. 
 
ఈ సేవలను ఆర్నెల్లపాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ తాజాగా జీవో విడుదలచేసింది. పనిచేయడానికి నిరాకరించినవారిని శిక్షించే అధికారం ఉంటుందని జీవోలో పేర్కొంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్‌ సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 182 ల్యాబ్లు పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) సంస్థ వెల్లడించింది. వీటిలో 130 ప్రభుత్వ ల్యాబ్‌లని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 8000 శాంపిల్స్ పరీక్షించామని తెలిపింది. అటు తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 102 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 411కి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments