Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడెవ్వడు.. వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు చిందులు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (23:05 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇజ్జత్ మొత్తాన్ని గంగలో కలిపేశారు ఉద్యోగస్తులు. పీఆర్సీపై ముఖ్యమంత్రి కాకుండా సజ్జల ఇష్టానుసారం మాట్లాడటం పెద్ద దుమారానికి కారణమైంది. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ మా జీతాల గురించి ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

 
ఈ నేపథ్యంలో ఛలో విజయవాడ పేరుతో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేసినా, నిర్భంధించినా వెనకడుగు వేయలేదు. 

 
ఉప్పెనలా ఉదయం 10 గంటల కల్లా విజయవాడకు చేరుకుని నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఇందులో సజ్జల రామక్రిష్ణారెడ్డిని అభాసుపాలు చేసేలా ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 

 
వాడెవ్వడు, వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు అష్టాచెమ్మా ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సజ్జల తీరును దుయ్యబట్టారు. పిఆర్సీ అంశంలో సజ్జల జోక్యమేంటని ఆక్షేపించారు. అలాంటి ఇలాంటి ర్యాగింగ్ మొదలెట్ట లేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. తమ సత్తాను చూపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments