గవర్నర్ కు విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వానం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (15:06 IST)
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంకు విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానం పలికారు. మంగళవారం విజయవాడ రాజ్ భవన్ కు వచ్చిన సరస్వతీ స్వామి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుండి పదకొండు వరకు నిర్వహించే పీఠం వార్షిక మహోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసారు.
 
 
శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠంగా విలసిల్లుతుందని, సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం చేపడుతుందని ఈ సందర్భంగా పీఠం ఉత్తరాధికారి గవర్నర్ కు వివరించారు. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా ప్రబోధం చేసే గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోందని తెలిపారు. వార్షిక మహోత్సవ వేడుకకు సకుటుంబ సమేతంగా విచ్చేసి, శుభాభినంద‌న‌లు అందించాల‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments