Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు: ఉగాది నుంచి అమలులోకి...?

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:23 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం దూకుడు పెంచింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చే ప్రక్రియ వేగవంతం అయ్యింది. త్వరలో అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జిల్లాల విభజన ఉగాది నుంచి అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. 
 
మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను రాష్ట్ర స్థాయి కమిటీ రెండు రోజుల్లో పరిశీలించనుంది. మార్చి 3 వరకు గడువు ఉన్నా సరే.. ఈలోపే ఒకట్రెండు సార్లు సూచనలు, అభ్యంతరాలను పరిశీలించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు బుధవారం సమావేశం కానున్నారు.  
 
అభ్యంతరాలు, సూచనల్లోని ప్రామాణికత, ఇతర అంశాలను అధ్యయనం చేసి.. చివరిగా వాటిని సీఎస్‌ నేతృత్వంలోని కమిటీకి సిఫారసు చేయనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. 
 
నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో అభ్యంతరాలు, ప్రామాణికత ఉన్న సూచనలను పరిశీలించనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments