Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం దుస్సాహసం

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (22:30 IST)
ఏపీ ప్రభుత్వం దుస్సాహసానికి పాల్పడింది. ఏకంగా ఏపీ సర్వోన్నత న్యాయస్థానం పైనే తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు సుప్రీంకోర్టుకూ ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం స్పందించారు. శనివారం రాత్రి విజయవాడలో కీలక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామన్నారు.
 
అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన స్టే ఇచ్చారని తెలిపారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కేసులో రాష్ట్ర హైకోర్టు ఏకంగా గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు.

ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ ఏ బాబ్డేకు ఫిర్యాదు చేశాం.

దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న లేఖ అందించినట్లు తెలిపారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
 
సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను.. ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఆ వెంటనే ఏకంగా ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయన్నారు.

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామాలు మారిపోయాయి.

చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన కేసులన్నీ జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ రమేష్‌ బెంచ్‌కు మారిపోయాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments