Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ప్పుల్లేకుండా జీతం బిల్లులు... త‌యారీ అంత సులువు కాదు!

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (12:12 IST)
ఏపీలో ఇపుడు పాల‌నా ప‌ర‌మైన ప్ర‌తిష్ఠంభ‌న కొనసాగుతోంది. ఒక‌టో తారీఖున ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల‌ను చెల్లించాలి. దీనికి సాల‌రీ బిల్లుల‌ను ట్రెజ‌రీ ఉద్యోగులు త‌యారు చేయాలి. కానీ, వారంతా ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు కొత్త పిఆర్ సికి అనుగుణంగా బిల్లులు తాము త‌యారుచేయం అని మొండికేశారు. దీనితో ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ, ఆ బిల్లులు త‌యారు చేయ‌డం అంత సలువు ఏమీ కాదంటున్నారు ఉద్యోగులు.
 
 
కొత్త పీఆర్సీ అమల్లో భాగంగా తప్పుల్లేకుండా బిల్లులు రూపొందించాలని, డీడీవోలు పంపించిన వివరాలను ఖజానా, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాల్లోని అధికారులు సరిచూసుకొని సమర్పించాలని ఇప్పటికే ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తప్పులు జరిగితే బాధ్యత వహించడంతో పాటు చర్యలకూ సిద్ధపడాలని హెచ్చరికలు వెళ్లాయి. 
 
 
ప్రతి ఉద్యోగి ఎస్‌ఆర్‌ను పరిశీలించాలి. ఇంక్రిమెంట్లు చేర్చడం నుంచి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని వేతన స్థిరీకరణ చేయాలి. ఇందుకు మార్చి 31 వరకు ప్రభుత్వమే గడువు ఇచ్చింది. అయినా ఆర్థిక శాఖ ఖ‌జానా ఉద్యోగుల‌ను తొందర పెడుతోంది. ఇంత హడావుడిగా వేతన స్థిరీకరణ చేస్తే,  భవిష్యత్తులో మేం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఖజానా విభాగం ఉద్యోగులు వాపోతున్నారు. కొత్త పి.ఆర్.సి. ప్ర‌కారం బిల్లులు చేస్తే, తోటి ఉద్యోగుల‌కు కోపం, చేయ‌క‌పోతే ప్ర‌భుత్వానికి కోపం అన్న‌ట్లు త‌యార‌యింది...ఆర్ధిక‌శాఖ‌ ఖ‌జానా ఉద్యోగుల ప‌రిస్థితి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments