చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై 8 రోజులు - ఇది ఒమిక్రాన్ ఆయుష్షు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (12:10 IST)
ప్రపంచంలో కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అధ్యయనాల్లో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులోభాగంగా, ఈ ఒమిక్రాన్ వైరస్ జీవితకాలాన్ని నిర్ధారించారు. ముఖ్యంగా, ప్లాస్టిక్‌పై ఎక్కువ రోజులు సజీవంగా ఉంటుందని తేలింది. 
 
సాధారణంగా ఇప్పటివరకు వెలుగు చూసిన వైరస్‌ల కంటే ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంలో (చర్మంపై) 21 గంటల పాటు సజీవనంగా ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. అలాగే, ప్లాస్టిక్‌పై కనీసం 8 రోజుల పాటు ఉంటుందని తేలింది. ఇది ఒమిక్రాన్ తీవ్రతను తెలియజేస్తుంది. గతంలో వెలుగు చూసిన కరోనా వైరస్ వేరియంట్లు ఇంత ప్రభావం చూపించలేదని ఈ పరిశోధనల్లో తేలింది. 
 
కొత్తగా 2.86 లక్షలు - మృతులు 573 
దేశంలో కరోనా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ రోజువారీగా నమోదయ్యేయ కరోనా కేసుల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... 
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,86,384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 573 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3.06.357 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22,02,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్లు.. 
ఇదిలావుంటే, ప్రస్తుతం కరోనా వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు వీలుగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కోవిషీల్డు, కోవ్యాగ్జిన్ టీకాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ టీకాలనే ఇపుడు వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ రెండు టీకాలకు బహిరంగ మార్కెట్ ధరను ఖరారు చేశారు. 
 
ఈ రెండు టీకాల ఒక్కో డోసు టీకా ధర రూ.275గా ఖరారు చేయగా, సర్వీసు చార్జీల రూపంలో మరో రూ.150ను అదనంగా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధరలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ ధర రూ.1200గాను, కోవిషీల్డ్ ధర రూ.780 లభ్యమవుతుంది. 
 
అయితే, ఇప్పటివరకు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమై ఈ రెండు టీకాలను ఇకపై బహిరంగ మార్కెట్‌లోకి తెచ్చేందుకు వీలుగా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ)కు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తును కోవిడ్ నిపుణుల కమిటి పరిశీలించి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments