Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వలంటీర్లకు జగన్ కానుక.. రూ.50 లక్షల బీమా సౌకర్యం

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (09:18 IST)
కరోనా కట్టడికి తమవంతుగా కృషి చేస్తున్న గ్రామ వలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ముందువరుసలో నిలబడి గ్రామాల్లో, పట్టణాల్లో సేవలందిస్తున్న గ్రామ వలంటీర్లకు రూ.50 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి పంచాయతీ రాజ్‌ శాఖకు ఓ సర్క్వులర్ జారీ అయింది.
 
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మందికి పైగా వలంటీర్లు ఉండగా, వీరందరికీ, పీఎంజీకే (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్) ప్యాకేజీ కింద బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లదే ప్రధాన పాత్రన్న సంగతి తెలిసిందే. 
 
కరోనా పాజిటివ్ వ్యక్తులతో వలంటీర్లు నేరుగా కాంటాక్ట్ అవుతుండటంతో, వైరస్ సోకే ప్రమాదం ఉన్నందునే, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమకు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడంపై వలంటీర్లు హర్షం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments