Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాం..... త‌ప్ప‌కే ఉద్యోగుల‌ ఉద్యమం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:46 IST)
పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని, అంత భయమెందుకని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని, అయినా కూడా సర్కారు నుంచి స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు. ఇక స్పందన రాదని తెలుసుకునే ఉద్యమం చేస్తున్నామని చెప్పారు.

 
పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ఇవాళ ప్రారంభమైంది. క‌డ‌ప‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు కూడా డిపోల ఎదుట నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. మ‌రో ప‌క్క రెవిన్యూ, పంచాయ‌తీరాజ్, మున్సిప‌ల్ కార్మికులు కూడా ఉద్యోగుల ఉద్య‌మంలో పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు చేసి నిరసన తెలియజేశారు. కర్నూలులో జరిగిన నిరసనల్లో బొప్పరాజు పాల్గొన్నారు. 
 
 
ఇన్నాళ్లూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, ప్రభుత్వాన్ని తాము ఇరుకునపడేయలేదని బొప్పరాజు గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బందిపెట్టొద్దని ఇన్నాళ్లూ సంయమనంతో ఉన్నామన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం మొక్కుబడి కోసం ఒకట్రెండు సమావేశాలను నిర్వహించి చేతులు దులుపుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని వల్ల ఉద్యోగులకు కలిగిన ప్రయోజనమేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న భావన ఉద్యోగుల్లో ఉందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments