Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థుల మార్కుల కేటాయింపులపై కసరత్తు

Webdunia
శనివారం, 10 జులై 2021 (12:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దుచేసింది. అయితే టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల మార్కులకు 30 శాతం వెయిటేజీ, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చినట్లు సమాచారం. 
 
పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మెటివ్ పరీక్షలను నిర్వహించారు. అయితే ఫార్మెటివ్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు. ఇలానే ఫార్మెటివ్ 2కు సైతం చేస్తారు.
 
ఉదాహరణకు 50 మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్ - 1 పరీక్షలో ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35, ఫార్మెటివ్ - 2 పరీక్షలో 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణలోకి తీసుకుంటారు. 
 
అయితే ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు. అయితే ఇంటర్నల్ మార్కుల విధానం అమలులోకి రావడానికి సర్కార్ జీఓ జారీ చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments